తెలంగాణలో మరో 425 మందికి కరోనా

Telangana corona media update
  • గత 24 గంటల్లో 41,042 కరోనా కేసులు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 130 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 1,060 మంది
  • ఇంకా 6,111 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 41,042 కరోనా పరీక్షలు నిర్వహించగా, 425 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాదులో 130 కొత్త కేసులు వెల్లడయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 29, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 28, నల్గొండ జిల్లాలో 23, ఖమ్మం జిల్లాలో 20 కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 1,060 మంది కరోనా నుంచి కోలుకోగా, ఎలాంటి మరణాలు సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,86,021 మంది కరోనా బారినపడగా, వారిలో 7,75,802 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 6,111 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,108కి పెరిగింది.
Go Back to Shorts
Telangana
Corona Virus
Update
Daily Bulletin
Today Cases

More Telugu News