Hurun: భారత్ లో అత్యధిక సంఖ్యలో కోటీశ్వరులు ఉన్న టాప్-3 నగరాలు ఇవే!

Hurun releases latest report on India wealthiest
  • హరూన్ సంస్థ తాజా నివేదిక
  • 2021 ఏడాదికి సంబంధించి ఆసక్తికర అంశాలు
  • ముంబయిలో అధిక సంఖ్యలో కోటీశ్వరులు
  • తర్వాత స్థానాల్లో ఢిల్లీ, కోల్ కతా
భారత్ లో సంపన్నుల సంఖ్య పెరుగుతోందని హరూన్ ఇండియా వెల్త్ రిపోర్ట్-2021 వెల్లడిస్తోంది. 2020తో పోల్చితే భారత్ లో కోటీశ్వరుల సంఖ్య 11 శాతం పెరిగిందని ఆ నివేదికలో పేర్కొన్నారు. అంతేకాదు, భారత్ లో సంపన్నులు అధికంగా ఉన్న నగరాల జాబితాను కూడా హురూన్ రిపోర్టులో పంచుకున్నారు. భారత్ లో అత్యధిక సంఖ్యలో కోటీశ్వరులు ముంబయి నగరంలో ఉన్నారట. ఆ తర్వాత ఢిల్లీ, కోల్ కతా నగరాలు ఉన్నాయి.

ముంబయిలో 20,300 మంది కోటీశ్వరులు ఉండగా, ఢిల్లీలో 17,400, కోల్ కతాలో 10,500 మంది ఉన్నారట. కనీసం రూ.7 కోట్ల నికర ఆస్తి ఉన్నవారిని హరూన్ సంస్థ కోటీశ్వరులుగా పరిగణించి తాజా జాబితా రూపొందించింది.

2020తో పోల్చితే భారత్ లో సంపన్న కుటుంబాల సంఖ్య 11 శాతం వృద్ధితో 4.58 లక్షలకు పెరిగినట్టు వెల్లడించింది. 2026 నాటికి భారత్ లో కోటీశ్వరుల సంఖ్య 6 లక్షలకు చేరుకుంటుందని హరూన్ అంచనా వేసింది.
Hurun
Rich
Wealth
India

More Telugu News