Somon Katich: సన్ రైజర్స్ హైదరాబాద్ కు సైమన్ కటిచ్ రాజీనామా

SRH assistant coanch Simon Katch resigns
  • అసిస్టెంట్ కోచ్ పదవికి కటిచ్ రాజీనామా
  • వేలంపాటలో ఫ్రాంఛైజీ అనుసరించిన వ్యూహాలు నచ్చకే అని వార్తలు
  • యాజమాన్యంతో విభేదాలు వచ్చినట్టు సమాచారం

ఐపీఎల్ జరగడానికి ముందు సన్ రైజర్స్ హైదరాబాదుకు పెద్ద షాక్ తగిలింది. అసిస్టెంట్ కోచ్ పదవికి సైమన్ కటిచ్ రాజీనామా చేశారు. ఇటీవల ఐపీఎల్ ఆటగాళ్ల కోసం జరిగిన మెగా వేలం పాటలో ఫ్రాంఛైజీ అనుసరించిన వ్యూహాలు నచ్చకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. యాజమాన్యంతో విభేదాలు వచ్చినందుకే జట్టును వీడుతున్నట్టు చెపుతున్నారు. ఈ మేరకు ఆస్ట్రేలియాకు చెందిన 'ది ఆస్ట్రేలియన్' కూడా ఓ కథనాన్ని ప్రచురించింది. కటిచ్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

  • Loading...

More Telugu News