హైదరాబాదులో సంప్రదాయ వైద్య కేంద్రం... సీఎం కేసీఆర్ కు కిషన్ రెడ్డి లేఖ
- భారత్ లో గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్
- ఏర్పాటుకు ముందుకొచ్చిన డబ్ల్యూహెచ్ఓ
- హైదరాబాదు వైపు చూస్తున్న కేంద్ర ఆయుష్ శాఖ
- భూమిని గుర్తించాలని సీఎం కేసీఆర్ ను కోరిన కిషన్ రెడ్డి
దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కూడా ప్రతిపాదనలు వచ్చాయని, ఈ కేంద్రం ఏర్పాటు కోసం సుమారు 40 నుంచి 50 ఎకరాల భూమి అవసరమవుతుందని పేర్కొన్నారు. ఈ గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన భూమిని తెలంగాణ ప్రభుత్వం వీలైనంత త్వరగా గుర్తించాలని కిషన్ రెడ్డి తన లేఖలో కోరారు.