Prime Minister: మహిషాసురుడిగా ప్రధాని మోదీ.. దుర్గాదేవిగా మమతా బెనర్జీ.. పోస్టర్ పై రచ్చ

PM Modi as Mahishasura and Mamata As Durga Devi Poster Erupts massive Storm
  • బెంగాల్ లోని మదనాపూర్ జిల్లాలో ఏర్పాటు
  • మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో దర్శనం
  • అభ్యర్థి అనిమా సాహా ఏర్పాటు చేశారని ఆరోపణ
  • ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్న బీజేపీ
  • సనాతన ధర్మానికి, ప్రధానికి తీవ్ర అవమానమని మండిపాటు
మహిషాసురుడిగా ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన్ను సంహరించే దుర్గాదేవిగా మమత బెనర్జీతో ఉన్న పోస్టర్ వైరల్ అవుతోంది. పశ్చిమబెంగాల్ లో ఇప్పుడా పోస్టర్ వివాదానికి కేంద్ర బిందువైంది. ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. అందులో భాగంగా మదనాపూర్ జిల్లాలో తృణమూల్ పార్టీకి చెందిన అభ్యర్థి అనిమా సాహా ఈ పోస్టర్ ను ఏర్పాటు చేశారు.

ఆ పోస్టర్ లో మోదీతో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షానూ మహిషాసురుడిగా చూపించారు. ఇతర పార్టీలను మేకలుగా చూపిస్తూ బలి పశువులుగా పేర్కొన్నారు. ఎవరైనా వారికి ఓటేస్తే.. వారిని బలిస్తామంటూ కింద నోట్ కూడా పెట్టారు. దీనిపై స్థానిక బీజేపీ నేత విపుల్ ఆచార్య మండిపడ్డారు. సనాతన ధర్మానికి, ప్రధాని మోదీ, అమిత్ షాకి ఇది తీవ్ర అవమానమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు.

అయితే ఆ పోస్టర్ ఎలా వచ్చిందన్న విషయం కూడా తనకు తెలియదని అనిమా సాహా చెప్పారు. అలాంటి పోస్టర్లను తానే పెట్టనివ్వనని పేర్కొన్నారు. ఈనెల 27 నుంచి 108 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి.
Prime Minister
Narendra Modi
West Bengal
Mamata Banerjee

More Telugu News