Dhanush: ఒక వ్యక్తితోనే ప్రేమ ఆగిపోదు: హీరో ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య

Aishwarya comments on love after divorce from Dhanush
  • 18 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికిన ధనుష్, ఐశ్వర్య
  • ప్రేమ అనేది చాలా అద్భుతమైనదన్న ఐశ్వర్య
  • తనకు తన తల్లిదండ్రులు, పిల్లలే అత్యంత ఇష్టమైన వ్యక్తులని వ్యాఖ్య

ప్రముఖ స్టార్ హీరో ధనుశ్, ఆయన భార్య ఐశ్వర్యలు తమ 18 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలికిన సంగతి తెలిసిందే. తామిద్దరం విడిపోతున్నామంటూ వారు సోషల్ మీడియా ద్వారా ఇటీవల ప్రకటించారు. ఐశ్వర్య తండ్రి రజనీకాంత్ వీరిద్దరూ విడిపోకుండా వుండడానికి ఎంతగానో ప్రయత్నించినప్పటికీ ఆయన ప్రయత్నాలు ఫలించలేదు.

ఇక భర్తతో విడిపోయిన తర్వాత ఐశ్వర్య తొలిసారి స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ప్రేమ అనేది అద్భుతమైనదని చెప్పారు. ప్రేమ అనేది ఒక వ్యక్తికో, వస్తువుకో సంబంధించినదో కాదని అన్నారు. ఒకరి భావాలను మరొకరు వ్యక్తపరుచుకోవడమే ప్రేమ అని అన్నారు. తన వయసు పెరిగే కొద్దీ తన మనసులో ప్రేమ నిర్వచనం మారుతూ వచ్చిందని చెప్పారు. ప్రేమ ఒక వ్యక్తితో మారిపోదని... ఇప్పుడు తనకు తన తల్లిదండ్రులు, పిల్లలే అత్యంత ఇష్టమైన వ్యక్తులని అన్నారు.

  • Loading...

More Telugu News