ఏపీలో కొత్తగా 528 కరోనా పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 22,339 కరోనా పరీక్షలు
- తూర్పు గోదావరి జిల్లాలో 101 కొత్త కేసులు
- రాష్ట్రంలో ఇద్దరి మృతి
- ఇంకా 9,470 మందికి చికిత్స
అదే సమయంలో 1,864 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,15,030 మంది కరోనా బారినపడగా, వారిలో 22,90,853 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 9,470 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,707కి పెరిగింది.