Suryakumar Yadav: రోహిత్ ముందుండి నడిపిస్తున్న తీరు బాగుంది: సూర్యకుమార్

Rohit Sharma is wonderfully leading from the front says Suryakumar Yadav
  • బలమైన మిడిలార్డర్ ను నిర్మించేందుకు కృషి
  • అతడు ఉన్నత శ్రేణి ఆటగాడు
  • మంచి ఓపెనింగ్ భాగస్వామ్యం కీలకమన్న సూర్యకుమార్ 
భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ పనితీరును జట్టులోని సభ్యుడైన సూర్యకుమార్ యాదవ్ ప్రశంసించాడు. వెస్టిండీస్ తో తొలి టీ20 మ్యాచ్ లో రోహిత్ శర్మ ఓపెనర్ గా వచ్చి దూకుడుగా బ్యాటింగ్ చేయడమే కాకుండా 40 పరుగులతో బలమైన పునాది వేయడం తెలిసిందే.
 
రోహిత్ శర్మ బ్యాట్ తో ముందుండి నడిపించే తీరు బాగుందని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు. పవర్ ప్లేలో జట్టు టాప్ ఆర్డర్ మంచి ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పడం ఎంతో ముఖ్యమన్నాడు. ‘‘రోహిత్ భిన్నంగా ఏమీ చేయడం లేదు. కానీ, మిడిల్ ఆర్డర్ తో బలమైన జట్టును నిర్మించాలనుకుంటున్నాడు. మొదటి టీ20 మ్యాచులో దూకుడుగా ఆడాడు. ప్రపంచం అంతా అతడి బ్యాటింగ్ ను చూసింది. అతడో ఉన్నత శ్రేణి ఆటగాడు. ఇంతకాలం భారత జట్టుకు ఆడిన మాదిరే ఆడాడు’’ అని సూర్యకుమార్ పేర్కొన్నాడు.
 
వెస్టిండీస్ తో తొలి టీ20లో సూర్యకుమార్ యాదవ్ కూడా రోహిత్ శర్మకు ఏ మాత్రం తగ్గకుండా దూకుడుగా ఆడాడన్నది వాస్తవం. కేవలం 18 బంతుల్లోనే 34 పరుగులు సాధించి నాటౌట్ గా ఉన్నాడు. రోహిత్ శర్మ సైతం 19 బంతుల్లో 40 పరుగులు రాబట్టుకున్నాడు. రోహిత్ కు జోడీగా ఆటను ఆరంభించిన ఇషాన్ కిషన్ 35 పరుగులు చేయడానికే 42 బంతులను వాడుకున్నాడు. రోహిత్, కిషన్ జోడీ 64 పరుగులు రాబట్టుకుంది.
Suryakumar Yadav
Rohit Sharma
T20 MATCH

More Telugu News