Deep Sidhu: లోలోపలే చస్తున్నా.. సింగర్ దీప్ సిద్ధూ మృతిపై అతడి ప్రేయసి భావోద్వేగ స్పందన

Deep Sidhu Girl Friend First Response After His Death
  • నా మనసు ముక్కలైపోయింది
  • ఆసుపత్రి బెడ్ మీద ఉంటే నువ్వొచ్చి ఏదో చెప్పినట్టుంది
  • భవిష్యత్ గురించి ఎన్ననుకున్నాం
  • ఇంతలోనే వదిలేసి వెళ్లావంటూ రీనారాయ్ ఆవేదన
హర్యానాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ సింగర్, ఎర్రకోట హింస కేసులో నిందితుడు దీప్ సిద్ధూ మరణించిన సంగతి తెలిసిందే. అతడు డ్రైవ్ చేస్తున్న స్కార్పియో కారు వెనుక నుంచి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్పాట్ లోనే దీప్ సిద్ధూ మరణించగా.. అదే కార్ లో పక్క సీట్ లో కూర్చున్న అతడి ప్రేయసి రీనా రాయ్ బతికి బయటపడింది. తాజాగా ఆమె స్పందించింది. దీప్ సిద్ధూ మృతిని తట్టుకోలేకపోతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

‘‘నా మనసు ముక్కలైపోయింది. నేను లోలోపలే చచ్చిపోతున్నాను. జీవితంలో ఎప్పుడూ వదిలి వెళ్లనూ అన్నావు.. నీ ప్రాణ ప్రేయసి కోసం తిరిగి వచ్చెయ్. నా ఆత్మ, నా జాను, నా గుండె చప్పుడువు నీవు. ఐ లవ్ యూ. నేను ఆసుపత్రి బెడ్ మీద ఉన్నప్పుడు.. నువ్వొచ్చి నా చెవిలో ఏదో చెబుతున్నట్టు అనిపించింది.

ఇద్దరం కలిసి భవిష్యత్ పై ఎన్నెన్ని ఆలోచనలు చేశాం.. ఎన్నో ప్రణాళికలు వేసుకున్నాం. ఇంతలో ఇలా వదిలేసి వెళ్లిపోయావు. ఐ లవ్ మై జాన్..  నువ్వెప్పుడూ నాతోనే ఉంటావని నాకు తెలుసు. సోల్ మేట్స్ ఒకరిని విడిచి ఇంకొకరు ఉండలేరు. నేను నిన్ను కలుస్తా’’ అంటూ రీనా రాయ్ పోస్ట్ పెట్టింది.
Deep Sidhu
Reena Rai
Republic Day

More Telugu News