లోలోపలే చస్తున్నా.. సింగర్ దీప్ సిద్ధూ మృతిపై అతడి ప్రేయసి భావోద్వేగ స్పందన
- నా మనసు ముక్కలైపోయింది
- ఆసుపత్రి బెడ్ మీద ఉంటే నువ్వొచ్చి ఏదో చెప్పినట్టుంది
- భవిష్యత్ గురించి ఎన్ననుకున్నాం
- ఇంతలోనే వదిలేసి వెళ్లావంటూ రీనారాయ్ ఆవేదన
‘‘నా మనసు ముక్కలైపోయింది. నేను లోలోపలే చచ్చిపోతున్నాను. జీవితంలో ఎప్పుడూ వదిలి వెళ్లనూ అన్నావు.. నీ ప్రాణ ప్రేయసి కోసం తిరిగి వచ్చెయ్. నా ఆత్మ, నా జాను, నా గుండె చప్పుడువు నీవు. ఐ లవ్ యూ. నేను ఆసుపత్రి బెడ్ మీద ఉన్నప్పుడు.. నువ్వొచ్చి నా చెవిలో ఏదో చెబుతున్నట్టు అనిపించింది.
ఇద్దరం కలిసి భవిష్యత్ పై ఎన్నెన్ని ఆలోచనలు చేశాం.. ఎన్నో ప్రణాళికలు వేసుకున్నాం. ఇంతలో ఇలా వదిలేసి వెళ్లిపోయావు. ఐ లవ్ మై జాన్.. నువ్వెప్పుడూ నాతోనే ఉంటావని నాకు తెలుసు. సోల్ మేట్స్ ఒకరిని విడిచి ఇంకొకరు ఉండలేరు. నేను నిన్ను కలుస్తా’’ అంటూ రీనా రాయ్ పోస్ట్ పెట్టింది.