లాస్ ఏంజెలెస్ లో ఉన్న బప్పీలహిరి కుమారుడు.. ఆయన రాకకోసం ఎదురుచూపులు!
- ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన బప్పీలహిరి
- శోకసంద్రంలో మునిగిపోయిన సంగీతప్రియులు
- రేపు ముంబైలో జరగనున్న అంత్యక్రియలు
అమెరికా నుంచి ఆయన కుమారుడు ఇప్పటికే బయలుదేరారు. ఆయన వచ్చిన తర్వాత ముంబైలో రేపు అంత్యక్రియలు జరగనున్నాయి. బప్పీలహిరి మృతిపై భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోదీతో పాటు ఎందరో ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు. ఒక అద్భుతమైన ప్రతిభావంతుడిని దేశం కోల్పోయిందని వారు నివాళులర్పించారు. 1952లో పశ్చిమబెంగాల్ లో బప్పీలహిరి జన్మించారు. దాదాపు 500 సినిమాలకు, 5 వేల పాటలకు ఆయన సంగీతాన్ని అందించారు.