Dawood ibrahim: ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం సోదరి, సోదరుడి ఇళ్లపై ఈడీ దాడులు

Probe Agency Conducts Raids At Dawood Ibrahims Sisters Residence
  • గ్యాంగ్‌స్టర్ చోటా షకీల్ బావమరిది ఇంటిపైనా దాడులు
  • ఎన్ఐఏ కేసు దర్యాప్తులో భాగంగానే..
  • వ్యాపారుల అక్రమ ఆస్తి వ్యవహారాల గుట్టు రట్టు!
  • పలువురు రాజకీయ నాయకులకూ సంబంధాలు!

ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్, సోదరుడు ఇక్బాల్ కస్కర్, గ్యాంగ్‌స్టర్ చోటా షకీల్ బావమరిది ఇళ్లపై ఈడీ అధికారులు నిన్న దాడులు చేశారు. మనీ లాండరింగ్, హవాలా, అక్రమ ఆస్తి లావాదేవీల వ్యవహారంలో భాగంగా ముంబైలోని పది చోట్ల ఈ సోదాలు నిర్వహించారు.

జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఇటీవల దావూద్ ఇబ్రహీంపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) నమోదు చేసింది. ఈ కేసులో భాగంగానే ఈడీ తాజాగా ఈ దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా ముంబై, దుబాయ్‌లలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కొందరు వ్యాపారుల అక్రమ ఆస్తి లావాదేవీలు, దౌర్జన్యంగా డబ్బు వసూలు చేసిన వ్యవహారాలకు సంబంధించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే, పలువురు రాజకీయ నాయకులకు కూడా ఈ వ్యవహారాలతో సంబంధం ఉన్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News