Manchu Vishnu: జగన్ ని కలిసిన మంచు విష్ణు.. వాహనాన్ని నేరుగా లోపలకు పంపించిన సిబ్బంది

Manchu Vishnu meets Jagan
  • తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లిన విష్ణు
  • ఇటీవల సీఎంను కలిసేందుకు వెళ్లిన సినీ ప్రముఖుల వాహనాలను గేటు వద్దే ఆపేసిన వైనం
  • గేటు వద్ద నుంచి నడుచుకుంటూ వెళ్లిన సినీ ప్రముఖులు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను సినీ హీరో, 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ తో భేటీ అయ్యారు. ఆయన వాహనాన్ని భద్రతా సిబ్బంది నేరుగా లోపలకు పంపించారు. ఇటీవల చిరంజీవి, మహేశ్ బాబు, ప్రభాస్, రాజమౌళి తదితరులు సీఎంను కలిసేందుకు వెళ్లినప్పుడు గేటు దగ్గరే వారి వాహనాలను ఆపేశారు. గేటు దగ్గర్నుంచి వారు నడుచుకుంటూ లోపలకు వెళ్లారు. ఈరోజు విష్ణు వాహనం నేరుగా లోపలకు వెళ్లింది. మరోవైపు ఈ సందర్భంగా మీడియాతో విష్ణు మాట్లాడుతూ సీఎంను మర్యాదపూర్వకంగా కలవడానికే వచ్చానని చెప్పారు.
Manchu Vishnu
Tollywood
Jagan
YSRCP

More Telugu News