Congress: అసోం ముఖ్యమంత్రిపై దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నేత‌ల ఫిర్యాదులు

congress protest against assom cm
షార్ట్స్‌లో చూడండి
అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వశర్మపై నేడు దేశ వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో కాంగ్రెస్ నేత‌లు ఫిర్యాదులు చేస్తున్నారు. కాంగ్రెస్ నేత‌ రాహుల్ గాంధీపై ఇటీవ‌ల హిమంత్ అనుచిత వ్యాఖ్యలు చేశార‌ని తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా మండిప‌డ్డ విష‌యం తెలిసిందే. అలాగే, కాంగ్రెస్ నేత‌లు కూడా అసోం సీఎంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న‌పై ఫిర్యాదులు చేయాల‌ని నిర్ణ‌యించారు.

కాంగ్రెస్ త‌ల‌పెట్టిన ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా హైద‌రాబాద్‌లోని జూబ్లిహిల్స్ పోలీస్ స్టేష‌న్‌కు టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి, సీనియ‌ర్ నేత షబ్బీర్ అలీ కాసేప‌ట్లో చేరుకుని ఫిర్యాదు చేయ‌నున్నారు. ఇప్ప‌టికే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఖమ్మం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అసోం ముఖ్య‌మంత్రి వ్యాఖ్య‌ల‌ప‌ట్ల‌ దేశ వ్యాప్తంగా నిర‌స‌న‌లు కూడా తెల‌ప‌నున్నారు. 
Go Back to Shorts
Congress
Revanth Reddy
Rahul Gandhi

More Telugu News