TDP MLAs: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కు ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేల లేఖ

Prakasam district TDP MLAs wrote Nirmala Sitharaman
  • ప్రకాశం జిల్లా వెనుకబాటుతనంపై లేఖ
  • వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్చాలని విజ్ఞప్తి
  • అత్యంత కరవుపీడిత జిల్లా ఇదేనన్న టీడీపీ ఎమ్మెల్యేలు
  • చేయూతనివ్వాలని వినతి
ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయస్వామి, ఏలూరి సాంబశివరావు లేఖ రాశారు. ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ప్రకాశం జిల్లాలో కరవు తాండవిస్తోందని, అపాయింట్ మెంట్ ఇస్తే స్వయంగా కలిసి జిల్లా పరిస్థితులను వివరిస్తామని నిర్మలా సీతారామన్ ను కోరారు.

ఉమ్మడి ఏపీలోనే అత్యంత కరవు పీడిత జిల్లా ప్రకాశం జిల్లా అని తెలిపారు. దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే 50 జిల్లాల్లో ప్రకాశం జిల్లా కూడా ఉందని టీడీపీ ఎమ్మెల్యేలు తమ లేఖలో పేర్కొన్నారు. ప్రకాశం జిల్లాకు చేయూత ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు.
TDP MLAs
Prakasam District
Nirmala Sitharaman
Andhra Pradesh

More Telugu News