కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన అసోం సీఎం హిమంత బిస్వా
- రాహుల్ రాజీవ్ కుమారుడే అని అనడానికి బీజేపీ రుజువులు అడిగిందా అన్న హిమంత
- హిమంతను బర్తరఫ్ చేయాలన్న కేసీఆర్
- గాంధీ కుటుంబంపై విమర్శలు చేయకూడదా అని ప్రశ్నించిన హిమంత
కేసీఆర్ వ్యాఖ్యలకు హిమంతి బిస్వా కౌంటర్ ఇచ్చారు. సర్జికల్ స్ట్రయిక్స్ పై రాహుల్ ఆధారాలు అడిగారని, బిపిన్ రావత్ మరణంపై వ్యాఖ్యలు చేశారని... అలాంటి వ్యక్తి గురించి తాము మాట్లాడకూడదా? అని ప్రశ్నించారు. గాంధీ కుటుంబంపై విమర్శలు చేయకూడదా? అని అడిగారు. కేసీఆర్ కు కేవలం తాను మాట్లాడిందే తప్పుగా అనిపించిందా? అని ప్రశ్నించారు.