Vijayasai Reddy: సినీ ప్రముఖులు జగన్ ను కలవడం పచ్చ పార్టీలో కలకలం లేపినట్టుంది: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy fires on Chandrababu
  • బాబుగారు, ఆయన కుమారుడు రాత్రి భోంచేసి ఉండరు
  • టీడీపీ నాయకులు పొర్లిపొర్లి శోకాలు పెట్టి ఉంటారు
  • సినిమా వాళ్లు చర్చలకు వెళ్తే ఇన్ని ఆర్తనాదాలు అవసరమా?
సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి జగన్ ను సినీ ప్రముఖులు చిరంజీవి, మహేశ్ బాబు, ప్రభాస్, రాజమౌళి తదితరులు కలిసిన సంగతి తెలిసిందే. ఈ భేటీకి సంబంధించి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుపారీ మీడియా ఏడుపు చూస్తుంటే సినీ ప్రముఖులు సీఎం జగన్ ని కలవడం పచ్చ పార్టీలో పెద్దపెద్ద కలకలమే లేపినట్టుందని అన్నారు. బాబు గారు, ఆయన తనయుడు రాత్రి భోంచేసి ఉండరని ఎద్దేవా చేశారు. యజమానుల బాధ చూసి పార్టీ నాయకులూ పొర్లిపొర్లి శోకాలు పెట్టి ఉంటారని అన్నారు. సినిమావాళ్లు చర్చలకు వెళ్తే ఇన్ని ఆర్తనాదాలు అవసరమా? అని ప్రశ్నించారు.
Vijayasai Reddy
YSRCP
Chandrababu
Telugudesam
Jagan
Tollywood

More Telugu News