Huge Edmeades: ఐపీఎల్ వేలం మధ్యాహ్నం 3.30 గంటలకు పునఃప్రారంభం... తేరుకున్న హ్యూ ఎడ్మీయడస్!

IPL auction rescheduled after auctioneer collapsed
  • ఐపీఎల్ వేలంలో హఠాత్పరిణామం
  • కుప్పకూలిన ఆక్షనర్
  • పరిశీలించిన వైద్యుల బృందం
  • లంచ్ విరామాన్ని ప్రకటించిన ఐపీఎల్ నిర్వాహకులు
బెంగళూరులో నిర్వహిస్తున్న ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో ఈ మధ్యాహ్నం జరిగిన హఠాత్పరిణామం అందరినీ ఆందోళనకు గురిచేసింది. వేలం నిర్వహిస్తున్న ప్రముఖ ఆక్షనీర్ హ్యూ ఎడ్మీయడస్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడం తెలిసిందే. దాంతో ఐపీఎల్ వేలం అర్థాంతరంగా నిలిచిపోయింది. ఎడ్మీయడస్ ను నిపుణులైన వైద్య బృందం పరిశీలించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన కుదుటపడినట్టు సమాచారం. తిరిగి ఐపీఎల్ వేలం ఈ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. అనుకోని ఈ అవాంతరం ఏర్పడిన నేపథ్యంలో, లంచ్ విరామాన్ని కాస్త ముందుగానే ప్రకటించారు.
Huge Edmeades
IPL
Auction
Bengaluru

More Telugu News