Allu Arjun: శ్రీరామానుజాచార్యులు సహస్రాబ్ది ఉత్సవాలకు హాజరైన అల్లు అర్జున్

Allu Arjun attends Sri Ramanujacharyulu millennium celebrations
  • ముచ్చింతల్ ఆశ్రమంలో సమతామూర్తి విగ్రహం
  • సందర్శించిన అల్లు అర్జున్
  • ఆశ్రమంలో బన్నీకి సాదర స్వాగతం

ముచ్చింతల్ లోని చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో గత కొన్నిరోజులుగా విశ్వసమతావాది శ్రీరామానుజాచార్యుల వారి సహస్రాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారు. తాజాగా, సమతామూర్తి విగ్రహాన్ని టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందర్శించారు.

ముచ్చింతల్ లోని శ్రీరామనగరానికి విచ్చేసిన అల్లు అర్జున్ ను చిన్నజీయర్ స్వామి ఆశ్రమ వర్గాలు సాదరంగా స్వాగతించాయి. బన్నీకి ఆశ్రమ విశేషాలు, సహస్రాబ్ది ఉత్సవాల విశిష్టత, సమతామూర్తి విగ్రహ ప్రాశస్త్యాన్ని వివరించారు. సమతామూర్తి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన దివ్యక్షేత్రాలను కూడా బన్నీ సందర్శించారు.

కాగా, ఇప్పటివరకు సమతామూర్తిని అనేకమంది ప్రముఖులు సందర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, జనసేనాని పవన్ కల్యాణ్ తదితరులు ఇక్కడికి విచ్చేశారు.

  • Loading...

More Telugu News