Nagarjuna: ఓటీటీ వైపు నుంచి 'బంగార్రాజు' ట్రైలర్!

Bangarraju Movie Update
  • థియేటర్లలో సందడి చేసిన 'బంగార్రాజు'
  • గ్రామీణ నేపథ్యంలో అలరించిన కథ 
  • జీ 5 చేతికి స్ట్రీమింగ్ హక్కులు 
  • ఈ నెల 18 నుంచి స్ట్రీమింగ్  
అక్కినేని నాగేశ్వరరావు గ్రామీణ నేపథ్యంలో చేసిన సినిమాలు అప్పట్లో సూపర్ హిట్లు కొట్టాయి. పల్లెటూరి బుల్లోడుగా తెరపై ఆయన చేసిన సందడి అంతా ఇంతా కాదు. అలాగే గ్రామీణ నేపథ్యంలో నాగార్జున చేసిన సినిమాలు కూడా ఆయనకి భారీ విజయాలను అందించాయి. ఆ జాబితాలో 'జానకి రాముడు' .. 'ప్రెసిడెంట్ గారి పెళ్ళాం' .. 'అల్లరి అల్లుడు' వంటివి కనిపిస్తాయి.

విలేజ్ నేపథ్యంలోనే ఆ మధ్య ఆయన చేసిన 'సోగ్గాడే చిన్నినాయనా' నాగార్జున కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించింది. ఆ సినిమాకి సీక్వెల్ గా రూపొందిన 'బంగార్రాజు' ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగార్జున సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించాడు.

థియేటర్ల నుంచి భారీ రెస్పాన్స్ ను రాబట్టిన ఈ సినిమా, ఈ నెల 18వ తేదీ నుంచి జీ 5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా జీ 5వారు ట్రైలర్ ను వదిలారు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. సస్పెన్స్ .. ఇలా కథను అన్ని వైపులా నుంచి కవర్ చేస్తూ వదిలిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఇక ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను రాబడుతుందో చూడాలి.
Nagarjuna
Ramyakrishna
Chaitu
Krithi Shetty
Bangarraju Movie

More Telugu News