Shreyas Iyer: అహ్మదాబాద్ లో మూడో వన్డే: అర్ధసెంచరీలతో ఆదుకున్న అయ్యర్, పంత్

Iyer and Pant makes fifty plus runs in Ahmedabad ODI
  • అహ్మదాబాద్ లో టీమిండియా వర్సెస్ వెస్టిండీస్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన భారత్
  • 30 ఓవర్లలో 4 వికెట్లకు 152 పరుగులు
అహ్మదాబాద్ లో వెస్టిండీస్ తో జరుగుతున్న మూడో వన్డేలో శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. 42 పరుగులకే 3 వికెట్లు వికెట్లు కోల్పోయిన టీమిండియాను... అయ్యర్, పంత్ జోడీ ఆదుకుంది. ప్రస్తుతం టీమిండియా 30 ఓవర్ల అనంతరం 4 వికెట్లకు 152 పరుగులతో ఆడుతోంది. 56 పరుగులు చేసిన పంత్... హేడెన్ వాల్ష్ బౌలింగ్ లో అవుటయ్యాడు. 60 పరుగులతో అయ్యర్ క్రీజులో ఉండగా, సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ కు దిగాడు.

అంతకుముందు, టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ రోహిత్ శర్మ 13 పరుగులు చేయగా, శిఖర్ ధావన్ 10 పరుగులు చేశారు. మాజీ సారథి విరాట్ కోహ్లీ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరుకున్నాడు.
Shreyas Iyer
Rishabh Pant
Ahmedabad ODI
Team India
West Indies

More Telugu News