ఏప్రిల్ లో ఏపీ ఇంటర్ పరీక్షలు!
- ఏప్రిల్ రెండో వారం నుంచి పరీక్షలు
- మార్చిలోగా ప్రాక్టికల్స్ నిర్వహణ
- ఒకటి, రెండు రోజుల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం
ఏప్రిల్ రెండో వారం నుంచి పరీక్షలను నిర్వహించేందుకు విద్యాశాఖ సన్నాహకాలు చేస్తోంది. రేపు లేదా ఎల్లుండి ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. తాజా సమాచారం ప్రకారం మార్చిలోగా ప్రాక్టికల్స్ ను నిర్వహించనున్నారు. కరోనా నేపథ్యంలో గత ఏడాది పరీక్షలను నిర్వహించకుండానే విద్యార్థులందరినీ ఏపీ ప్రభుత్వం పాస్ చేసిన సంగతి తెలిసిందే.