Medaram Jatara: మేడారం జాతర ఆహ్వాన పత్రికను అందుకున్న సీఎం కేసీఆర్

CM KCR gets Medaram Carnival invitation
  • విశిష్ట గుర్తింపు పొందిన మేడారం జాతర
  • పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తుల రాక
  • ఈ నెల 16 నుంచి జాతర
  • సీఎం కేసీఆర్ ను కలిసిన మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఏర్పాట్లు షురూ అయ్యాయి. తెలంగాణలోనే కాకుండా, పొరుగు రాష్ట్రాల్లోనూ ఈ జాతరకు ఎంతో గుర్తింపు ఉంది. ఏపీ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుంచి కూడా మేడారం జాతరకు భక్తులు తరలివస్తారు. ఈ జాతర ఫిబ్రవరి16న ప్రారంభం కానుంది. కాగా, తెలంగాణ మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు సీఎం కేసీఆర్ కు మేడారం జాతర ఆహ్వాన పత్రిక అందజేశారు. ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Medaram Jatara
Sammakka-Saralamma
CM KCR
Telangana

More Telugu News