KTR: మోదీ వ్యాఖ్యలపై తెలంగాణలో గరంగరం... నిరసనలకు పిలుపునిచ్చిన కేటీఆర్

KTR calls for protests in Telangana
  • రాష్ట్ర విభజన సరిగా జరగలేదన్న మోదీ
  • మండిపడుతున్న టీఆర్ఎస్
  • బీజేపీ దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలన్న కేటీఆర్
  • నల్లజెండాలతో నిరసనలు చేపట్టాలని పిలుపు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. మోదీ వ్యాఖ్యలను అటు కాంగ్రెస్ తో పాటు, టీఆర్ఎస్ పార్టీ కూడా తీవ్రంగా పరిగణిస్తోంది. ఎంతో పోరాడి తాము తెలంగాణ తెచ్చుకుంటే, రాష్ట్ర విభజన సరిగా జరగలేదంటూ మోదీ అనడం టీఆర్ఎస్ నేతలను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది. తెలంగాణ ఏర్పాటుపై పార్లమెంటులో విషం చిమ్ముతూ అడ్డగోలుగా మాట్లాడారంటూ మండిపడుతున్నారు.

ఈ నేపథ్యంలో, బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణలోని అన్ని మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో బీజేపీ పార్టీ దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలని సూచించారు. నల్లజెండాలతో నిరసన ప్రదర్శనలు చేపట్టాలని తెలిపారు.
KTR
Protests
TRS
Telangana
Narendra Modi
Bifurcation

More Telugu News