Andhra Pradesh: బడ్జెట్‌ను ఏ ఒక్క రాష్ట్రానికో అన్వయించి చూడద్దన్న కేంద్రమంత్రి.. నల్ల జెండాలతో నిరసన తెలిపిన సీపీఐ నేతలు!

there is no finanical discipline in Andhrapradesh Govt said union minister karad
  • బడ్జెట్‌పై నిన్న విజయవాడలో విలేకరులతో మాట్లాడిన కేంద్రమంత్రి కరాడ్
  •  ప్రభుత్వ ఆదాయానికి తగినట్టుగానే ఖర్చులు ఉండాలన్న మంత్రి
  • ఏపీ ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లోపించిందని ఆరోపణ 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లోపించిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి డాక్టర్ భగవంత్ కిషన్‌రావు కరాడ్ విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌పై నిన్న విజయవాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఆదాయానికి తగినట్టుగానే ఖర్చులు కూడా ఉండాలని అయితే, ఏపీలో మాత్రం ఇది లోపించిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ఏ ఒక్క రాష్ట్రానికో అన్వయించి చూడడం సరికాదని, దానిని దేశం దృష్టితో చూడాలని సూచించారు.

రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి రూ. 64 వేల కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పారు. బడ్జెట్‌లో అన్ని రంగాలకు సమ ప్రాధాన్యం  ఇచ్చామన్న ఆయన.. గోదావరి, పెన్నా, కృష్ణా నదుల అనుసంధానంతో రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు. మరోవైపు, కేంద్ర బడ్జెట్‌లో ఏపీ పేరు ప్రస్తావించని బీజేపీ మంత్రులకు రాష్ట్రంలో పర్యటించే హక్కు లేదంటూ సీపీఐ నేతలు నల్లజెండాలతో కేంద్ర మంత్రికి నిరసన తెలిపారు.
Andhra Pradesh
Dr Bhagwat Kishanrao Karad
BJP
Vijayawada

More Telugu News