IIT Bhubaneswar: అన్ని వేరియంట్లకూ ఒకే టీకాతో చెక్.. అభివృద్ధి చేసిన భారత శాస్త్రవేత్తలు

Indian Scientists developed on vaccine for all variants
  • ప్రపంచంలో ఇలాంటి టీకా ఇదొక్కటే
  • ఆరు రకాల వైరస్‌లను మట్టుబెట్టే వ్యాక్సిన్
  • ‘అభిఎస్‌సీవో వ్యాక్’ అని పేరు
కరోనా వైరస్‌లోని అన్ని వేరియంట్లకు ఇక ఒకే ఒక్క టీకాతో చెక్ చెప్పొచ్చు. ఈ మేరకు సరికొత్త టీకాను భారతీయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని కాజీ నజ్రుల్ విశ్వవిద్యాలయం, భువనేశ్వర్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ టీకాకు ‘అభిఎస్‌సీవో వ్యాక్’ అని పేరు పెట్టారు.

ఇది పెప్టైడ్ వ్యాక్సిన్. కొవిడ్-19కు కారణమయ్యే సార్స్-కోవ్-2తోపాటు ఆ తరగతికి చెందిన ఆరు రకాల వైరస్‌లపై ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. కరోనాలోని అన్ని వైరస్‌లపైనా పనిచేసే ఏకైక టీకా ప్రపంచంలో ఇదొక్కటేనని శాస్త్రవేత్తలు తెలిపారు.
IIT Bhubaneswar
Kazi Nazrul University
One Vaccine
Corona Virus
AbhiSCoVac

More Telugu News