ఉద్యోగ సంఘాలతో మంత్రుల చర్చలు సఫలం... సమ్మె విరమించుకోనున్న ఉద్యోగులు!
- 7 గంటలపాటు కొనసాగిన చర్చలు
- పలు అంశాలపై ఓ కొలిక్కి వచ్చిన చర్చలు
- కొన్ని అంశాలు అభ్యంతరాల కమిటీకి నివేదన
- సమ్మె విరమణ నిర్ణయం ప్రకటించనున్న ఉద్యోగులు
శనివారం మధ్యాహ్నం నుంచి జరుగుతున్న చర్చల్లో హెచ్ఆర్ఏ శ్లాబులపై ప్రతిష్టంభన తొలగించేందుకే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. కాగా, చర్చల అనంతరం మంత్రుల కమిటీ సీఎం జగన్ కు చర్చల వివరాలు తెలిపింది. ఆపై, ఆయన ఆన్ లైన్ లో ఉద్యోగ సంఘాల నేతలతో మాట్లాడారు.