Ramcharan: చరణ్ జోడీగా రష్మిక ఛాన్స్ కొట్టేసినట్టే!

Rshmika in Charan movie
షార్ట్స్‌లో చూడండి
అందం .. అభినయంతో పాటు అదృష్టం కూడా రష్మికకి పుష్కలంగా ఉందనే విషయం అర్థమైపోతోంది. వరుస సినిమాలతో .. వరుస విజయాలతో తెలుగులో దూసుకుపోతోంది. కన్నడలో కావాల్సినంత క్రేజ్ ను సంపాదించుకున్న ఈ బ్యూటీ, తమిళ .. హిందీ భాషల్లోనూ కుదురుకునే ప్రయత్నాల్లో ఉంది.

ఇటీవల ఆమె చేసిన 'పుష్ప' పాన్ ఇండియా స్థాయిలో విజయఢంకా మోగించడంతో, అమ్మడి క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. దాంతో ఈ సుందరికి చరణ్ సరసన నాయికగా ఛాన్స్ దొరికినట్టు తెలుస్తోంది. 'జెర్సీ' దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో చరణ్ ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

ముందుగా ఈ సినిమాలో కథానాయికగా దిశా పటానీని అనుకున్నారు. కానీ తాజాగా రష్మికను ఫైనల్ చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. ప్రస్తుతం రష్మిక 'పుష్ప 2' షూటింగుకి రెడీ అవుతుంటే, శంకర్ తో చరణ్ చేస్తున్న సినిమా సెట్స్ పై ఉంది.
Go Back to Shorts
Ramcharan
Rashmika Mandanna

More Telugu News