Gorantla Butchaiah Chowdary: 'ప్రియమైన ముఖ్యమంత్రి గారు.. మీరు పవర్ఫుల్ అంటారు కదా?' అంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సెటైర్లు
ఏపీలో విద్యుత్తు సమస్యపై టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సెటైర్లు వేశారు. 'సెటైర్ నెక్ట్స్ లెవెల్' హ్యాష్ ట్యాగ్ తో ఆయన ఈ చురకలు అంటించడం గమనార్హం. 'ప్రియమైన ముఖ్యమంత్రి గారూ' అంటూనే ఆయన జగన్‌ను విద్యుత్ సమస్యపై నిలదీశారు.
'ప్రియమైన ముఖ్యమంత్రి గారు... మీరు పవర్ఫుల్ అంటారు మీ పేటీఎం కార్మికులు. కానీ, పవర్ ఉండడం లేదు. ఇంతకీ దీని వెనుక కథ ఏంటి? వచ్చేది వేసవి కాలం కనుక ఇప్పటి నుంచే మొదలు పెట్టారా ప్రియమైన ముఖ్యమంత్రి గారు.. కోతలు.. మాటలు తాడేపల్లి కోట దాటే లోపు కరెంటు కోత చేస్తున్నారు.. ఇంతకీ కరెంటు లోటు ఏర్పడిందా లేక ఏర్పడేలా చేశారా?' అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. #SatireNextLevel అని ఆయన పేర్కొన్నారు.