Narendra Modi: హైదరాబాద్ పర్యటనపై మోదీ ట్వీట్!

Modi tweet on Hyderabad trip
  • రెండు కార్యక్రమాల్లో పాల్గొనడానికి హైదరాబాద్ వెళ్తున్నా
  • మధ్యాహ్నం ఇక్రిశాట్ 50 ఏళ్ల ఉత్సవాలకు హాజరవుతా
  • సాయంత్రం రామానుజాచార్యుల వారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటా
ప్రధాని మోదీ ఈరోజు హైదరాబాద్ పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాని పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మరోవైపు తన పర్యటన వివరాలను మోదీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

రెండు కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం కోసం హైదరాబాద్ వెళ్తున్నానని మోదీ తెలిపారు. మధ్యాహ్నం 2.45 గంటలకు ఇక్రిశాట్ 50 ఏళ్ల ఉత్సవాలకు హాజరవుతానని ఆయన చెప్పారు. వ్యవసాయం, ఆవిష్కరణల రంగంలో ఈ సంస్థ విశేషమైన కృషి చేస్తోందని తెలిపారు. సాయంత్రం 5 గంటలకు సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటానని మోదీ చెప్పారు. తన పవిత్రమైన ఆలోచనలు, ఆథ్యాత్మిక బోధనలతో మనల్ని ఉత్తేజితం చేసిన రామానుజాచార్యుల వారికి ఇది ఘన నివాళి అని అన్నారు.
Narendra Modi
BJP
Hyderabad

More Telugu News