తమిళ సినిమా రీమేక్ లో పవన్ .. సాయితేజ్?
- తమిళంలో వచ్చిన 'వినోదాయ సితం'
- పూర్తి వినోదభరితంగా నడిచే కథ
- దర్శకుడిగా సముద్రఖని
- తెలుగు రీమేక్ కి సన్నాహాలు
తాజాగా తమిళంలో హిట్ కొట్టిన మరో కథ తెలుగుకు రానున్నట్టుగా తెలుస్తోంది .. ఆ సినిమా పేరే 'వినోదాయ సితం'. తమిళంలో క్రితం ఏడాది అక్టోబర్లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఈ సినిమాకి సముద్రఖని దర్శకత్వం వహించడమే కాకుండా, ఆయన ప్రధానమైన పాత్రను పోషించాడు.
సముద్రఖని ఈ కథను పవన్ కి వినిపించడం .. సినిమా చూపించడం జరిగిందనీ, ఆయన దర్శకత్వంలో ఈ సినిమా రీమేక్ లో చేయడానికి పవన్ ఉత్సాహాన్ని చూపించారనే టాక్ వచ్చింది. పవన్ తో పాటు మరో ముఖ్యమైన పాత్రను ఈ సినిమాలో సాయితేజ్ చేయనున్నాడనేది తాజా సమాచారం. ఆయనకి మంచి బ్రేక్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే పవన్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడని అంటున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.