Singer Sunitha: తన భర్తను అవమానించిన నెటిజన్ పై సింగర్ సునీత ఫైర్!

Singer Sunitha fires on netizen who criticised her husband Ram
  • సునీతకు ముసలి రామ్ మొగుడు అంటూ ఓ నెటిజన్ కామెంట్
  • అందం ఈమె సొంతం. ధనం ఆయన సొంతం అని వ్యాఖ్య
  • నోటి దూల నీది. నీ భారం భూమిది అన్న సునీత
ప్రముఖ సినీ గాయని సునీత గత ఏడాది రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. బిజినెస్ మెన్ రామ్ వీరపనేనిని ఆమె పెళ్లాడారు. వారి వైవాహిక జీవితం అన్యోన్యంగా కొనసాగుతోంది. మరోవైపు తన భర్తను కించపరుస్తూ కామెంట్ చేసిన ఓ నెటిజెన్ కు సునీత ఘాటుగా సమాధానమిచ్చింది. చినజీయర్ స్వామికి చెందిన ఆశ్రమంలో రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విగ్రహాన్ని సునీత, ఆమె భర్త రామ్ సందర్శించారు. ఈ ఫొటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటూ ఫొటోను పంచుకున్నారు.

ఈ పిక్ పై ఓ నెటిజన్ అభ్యంతరకరంగా కామెంట్ చేశాడు. 'కాకి ముక్కుకు దొండపండు. సునీతకు ముసలి రామ్ మొగుడు. అందం ఈమె సొంతం. ధనం ఆయన సొంతం. గానం ఈవిడది. దర్జా అతనిది' అని రామ్ ను కించపరిచేలా కామెంట్ పెట్టాడు. ఈ వ్యాఖ్యలపై సునీత అదే స్థాయిలో సమాధానమిచ్చారు. 'నోటి దూల నీది. నీ భారం భూమిది' అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు.
Singer Sunitha
Husband
Ram

More Telugu News