నేడు వసంత పంచమి.. భక్తులతో కోలాహలంగా బాసర

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతి దేవి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. చదువుల తల్లి సమక్షంలో తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేందుకు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు. దీంతో అర్ధరాత్రి నుంచి ఆలయం కోలాహలంగా మారింది. క్యూలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మరోవైపు, తెల్లవారుజామున 2 గంటలకు అభిషేకంతో ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి  అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.


More Telugu News