తెలంగాణలో మరో 2,421 మందికి కరోనా... వివరాలు ఇవిగో!
- గత 24 గంటల్లో 81,417 కరోనా టెస్టులు
- జీహెచ్ఎంసీ పరిధిలో 649 మందికి పాజిటివ్
- రాష్ట్రంలో ఇద్దరి మృతి
- ఇంకా 33,104 మందికి చికిత్స
అదే సమయంలో 3,980 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,71,828 మంది కరోనా బారినపడగా, వారిలో 7,34,628 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 33,104 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,096కి పెరిగింది.
