సచివాలయంలో సీఎం జగన్ తో సజ్జల, సీఎస్ భేటీ
- లక్షమందితో 'ఛలో విజయవాడ' విజయవంతం
- ఉద్యోగుల నిరసనల నేపథ్యంలో సీఎం మీటింగ్
- సమావేశంలో పాల్గొన్న వైవీ సుబ్బారెడ్డి
- సాయంత్రం 6 గంటలకు సీఎస్ ప్రెస్ మీట్
కాగా, ఈ సాయంత్రం 6 గంటలకు సీఎస్ సమీర్ శర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. సీఎం జగన్ తో చర్చించిన విషయాలపై ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి.
కొంతకాలంగా తమ డిమాండ్ల కోసం ఉద్యమిస్తున్న ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు నేడు భారీ ఎత్తున విజయవాడ తరలిరావడం తెలిసిందే. ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో 'ఛలో విజయవాడ' కార్యక్రమాన్ని అనూహ్య రీతిలో విజయవంతం చేశారు.