Vijayashanti: శశికళతో బీజేపీ నేత విజయశాంతి భేటీ.. మంచి వారికి ఎప్పుడూ మంచే జరుగుతుందన్న నటి

BJP leader vijayashanti meets vk sasikala at her home in chennai
  • శశికళ నివాసంలో మర్యాద పూర్వక భేటీ
  • చిన్నమ్మ తనకు తల్లిలాంటిదన్న విజయశాంతి
  • జయలలితతో తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న నటి
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళతో బీజేపీ నేత, ప్రముఖ నటి విజయశాంతి నిన్న భేటీ అయ్యారు. చెన్నైలోని శశికళ నివాసంలో వీరిద్దరూ సమావేశమయ్యారు. ఇది మర్యాదపూర్వక భేటీ అని సమాచారం. ఈ  సందర్భంగా జయలలితతో తన జ్ఞాపకాలను ‘రాములమ్మ’ గుర్తు చేసుకున్నారు.

కాగా, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ అరెస్టై పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలోనూ విజయశాంతి ఆమెను కలిశారు. జయలలిత అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నప్పుడు శశికళ ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని అప్పట్లో విజయశాంతి వ్యాఖ్యానించారు.

కాగా, చిన్నమ్మ తనకు తల్లిలాంటిదని, తాను ఆమెకు కుమార్తె లాంటిదానినని విజయశాంతి తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. మంచి వారికి ఎప్పుడూ మంచే జరుగుతుందంటూ శశికళతో భేటీ అయిన ఫొటోలను షేర్ చేశారు.
Vijayashanti
VK Sasikala
Tamil Nadu
BJP

More Telugu News