pushpa Sreevani: ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి ఊరట!

Appellate authority clarifies Pushpa Sreevani is ST
  • పుష్ప శ్రీవాణి కులంపై వివాదం
  • హైకోర్టు ఆదేశాలతో విచారణ జరిపిన అప్పీలేట్ అథారిటీ
  • ఆమె గిరిజనురాలేనని తేల్చిన అథారిటీ
ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి అప్పిలేట్ అథారిటీ ఊరటను కలిగించింది. ఆమె ఎస్టీనే అని అప్పిలేట్ అథారిటీ తెలిపింది. పుష్ప శ్రీవాణి ఎస్టీ కాదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలయిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఆమె ఏ కులమో తేల్చాలంటూ అప్పిలేట్ అథారిటీని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో విచారణ చేపట్టిన అథారిటీ ఆమె గిరిజనురాలేనని నిర్ధారించింది. ఆమెది ఎస్టీకి చెందిన కొండదొర సామాజికవర్గమని పేర్కొంది. దీంతో ఆమెకు పెద్ద ఊరట లభించినట్టయింది.
pushpa Sreevani
YSRCP
Caste

More Telugu News