Bandi Sanjay: రేపు మౌనదీక్ష చేపట్టనున్న బండి సంజయ్

Bandi Sanjay to takeup Mauna Deeksha tomorrow
  • రాజ్యాంగాన్ని మార్చాలంటూ కేసీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు
  • తెలంగాణ వ్యాప్తంగా రేపు బీజేపీ శ్రేణుల దీక్ష
  • రాజ్ ఘాట్ వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపనున్న బీజేపీ ఎంపీలు
రాజ్యాంగాన్ని మార్చాలంటూ నిన్న తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. అంతేకాదు ప్రధాని మోదీపై ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ నేతలు మండిపడుతున్నారు. రేపు తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు దీక్షను చేపట్టబోతున్నాయి.

ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రేపు ఢిల్లీలో మౌన దీక్షను చేపట్టబోతున్నారు. బీజేపీ ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాపూరావు, కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం, పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి కామర్సు బాలసుబ్రహ్మణ్యం తదితర నేతలతో కలసి ఆయన దీక్షకు దిగనున్నారు. ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద బీజేపీ ఎంపీలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపనున్నారు.

మరోవైపు బండి సంజయ్ ఈరోజు మాట్లాడుతూ, కేసీఆర్ దేశద్రోహి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మార్చాల్సింది రాజ్యాంగాన్ని కాదని, సీఎం కేసీఆర్ ను అని అన్నారు.
Bandi Sanjay
BJP
KCR
TRS

More Telugu News