Jayaprada: సీనియర్ నటి జయప్రదకు మాతృవియోగం

Jayaprada mother Neelaveni is no more
  • జయప్రద తల్లి నీలవేణి కన్నుమూత
  • ఇటీవల అస్వస్థతకు గురైన నీలవేణి
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయల్దేరిన జయప్రద

సీనియర్ నటి, రాజకీయవేత్త జయప్రద కుటుంబంలో విషాదం నెలకొంది. జయప్రద మాతృమూర్తి నీలవేణి కన్నుమూశారు. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైన నీలవేణి హైదరాబాదులోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో నేడు తుదిశ్వాస విడిచారు. తల్లి మరణంతో జయప్రద శోకసంద్రంలో మునిగిపోయారు. ఢిల్లీలో ఉన్న ఆమె తల్లి మరణవార్తతో వెంటనే హైదరాబాద్ కు బయల్దేరారు.

  • Loading...

More Telugu News