'భారత సైన్యానికి భూమి విరాళం' అంటూ ప్రచారం.. సినీ నటుడు సుమన్ వివరణ!

ప్రముఖ సినీ నటుడు సుమన్ భారత సైన్యానికి 117 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చి గొప్ప మనసు చాటుకున్నట్టు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హోరెత్తుతున్నాయి. ఈ వార్తలపై తాజాగా సుమన్ స్పందించారు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదని స్పష్టం చేశారు.

ఇండియన్ ఆర్మీకి ఇచ్చినట్టుగా చెబుతున్న భూమి వివాదంలో ఉందని, ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉందని చెప్పారు. వివాదం పరిష్కారమైన వెంటనే తానే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడిస్తానని చెప్పారు. కాబట్టి సామాజిక మాధ్యమాల్లో ప్రచారమయ్యే ఇలాంటి వార్తలను నమ్మొద్దని సుమన్ కోరారు.

Suman
Tollywood
Actor
Indian Army
Land

More Telugu News