తెలంగాణలో మరో 2,861 మందికి కరోనా పాజిటివ్
- గత 24 గంటల్లో 81,486 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 746 కొత్త కేసులు
- రాష్ట్రంలో ముగ్గురి మృతి
- ఇంకా 37,168 మందికి చికిత్స
అదే సమయంలో 4,413 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,63,911 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,22,654 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 37,168 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,089కి పెరిగింది.
