Chiranjeevi: 'ఆచార్య' కూడా వచ్చేస్తున్నాడు... రిలీజ్ డేట్ ఖరారు!

Chiranjeevi Acharya movie set to release in April
  • తగ్గుతున్న కరోనా కేసులు
  • కుదుటపడుతున్న పరిస్థితులు
  • టాలీవుడ్ పెద్ద సినిమాల విడుదల తేదీలు ఖరారు
  • మార్చి 25న వస్తున్న 'ఆర్ఆర్ఆర్'
  • ఏప్రిల్ 29న 'ఆచార్య' రిలీజ్
గత డిసెంబరు, ఈ జనవరి మాసాల్లో కరోనా విజృంభించడంతో పాటు, పలు ఇతర పరిణామాలతో అనేక పెద్ద సినిమాలు విడుదల కాకుండా నిలిచిపోయాయి. ప్రస్తుతం పరిస్థితులు క్రమంగా కుదుటపడుతుండడంతో ఒక్కొక్క సినిమా విడుదల తేదీలు వెల్లడవుతున్నాయి.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' మార్చి 25న వస్తుండగా, మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఆచార్య' చిత్రం రిలీజ్ డేట్ ను కూడా నేడు వెల్లడించారు. 'ఆచార్య' చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్రబృందం వెల్లడించింది.

ఎంతో ఆరోగ్యకరమైన వాతావరణంలో చర్చలు జరిగిన పిమ్మట, పరస్పర అవగాహన, అంగీకారంతో ఓ నిర్ణయానికి వచ్చినట్టు చిత్ర నిర్మాణ సంస్థ వివరించింది. చిరంజీవి, రామ్ చరణ్, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే నటించిన 'ఆచార్య' చిత్రానికి కొరటాల శివ దర్శకుడు. ఈ చిత్రం కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టయిన్ మెంట్ పతాకంపై తెరకెక్కింది.
Chiranjeevi
Acharya
Release Date
RRR
Corona Virus
Tollywood

More Telugu News