విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టగానే బాబు కంటే మొదట మూర్ఛపోయింది యనమలే: విజయసాయిరెడ్డి
- విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు
- సర్వత్రా హర్షం
- యనమలపై ధ్వజమెత్తిన విజయసాయి
- ఎన్టీఆర్ శాపం అంటూ ట్వీట్
సీఎం జగన్ విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరుపెట్టగానే బాబు కంటే మొదట మూర్ఛపోయింది యనమలేనని వ్యంగ్యం ప్రదర్శించారు. 'రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ వ్యవస్థాపకుడి పేరు వినడానికే ఇష్టపడడట ఈ నమ్మకద్రోహి' అంటూ యనమలపై ధ్వజమెత్తారు. 'ఎన్టీఆర్ శాపం వల్లే ప్రత్యక్ష ఎన్నికల్లో యనమల వరుసగా ఓడిపోతున్నాడని రాష్ట్రమంతా ప్రచారంలో ఉందని' ఎద్దేవా చేశారు.