Andhra Pradesh: ఆయనో కట్టప్ప ‘మంత్రి’.. ప్రజలేనాడో మరచిపోయారు: విజయసాయిరెడ్డి

Vijaya Sai Reddy Comments On Yanamala Criticizes Worst FinMin In AP History
  • టీడీపీ నేత యనమలపై విమర్శలు
  • అత్యంత చెత్త ఆర్థిక మంత్రి అంటూ మండిపాటు
  • ఏడాదిలో 300 రోజులు ఓవర్ డ్రాఫ్టేనంటూ ఎద్దేవా
టీడీపీ నేత యనమల రామకృష్ణుడుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఆయనో కట్టప్ప అంటూ ఎద్దేవా చేశారు. ఏపీ చరిత్రలోనే అత్యంత చెత్త ఆర్థిక మంత్రి ఎవరంటే ఆయన పేరే వినిపిస్తుందని అన్నారు. ఒక ఏడాదిలో 300 రోజులకుపైగా ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్లిన చరిత్ర ఆయనదని అన్నారు.

వివిధ పథకాలకు ఆర్థిక వనరుల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. తానో పెద్ద మేధావినంటూ నీతి వచనాలు వల్లిస్తారని ఎద్దేవా చేశారు. ప్రజలు ఆయన్ను ఏనాడో మరచిపోయారని విజయసాయిరెడ్డి విమర్శించారు.
Andhra Pradesh
YSRCP
Vijayasai Reddy
Yanamala
Telugudesam

More Telugu News