Yuvraj Singh: మాకు పండంటి మగబిడ్డ పుట్టాడు: టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్

Yuvraj Singh Wife Hazel Keech Blessed With Baby Boy
  • ట్విట్టర్ ద్వారా అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పిన యువీ
  • అందరితో పంచుకోవడం ఆనందంగా ఉందన్న మాజీ ఆల్‌రౌండర్
  • అభినందనలు సోదరా.. అంటూ ఇర్ఫాన్ ట్వీట్
టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రయ్యాడు. యువీ భార్య హేజల్ కీచ్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని యువరాజ్ ట్విట్టర్ ద్వారా అభిమానులకు వెల్లడిస్తూ సంతోషం వ్యక్తం చేశాడు.

అభిమానులు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఈ విషయాన్ని పంచుకోవడం ఆనందంగా ఉందన్న యువరాజ్.. భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నట్టు తెలిపాడు. ఈ ప్రపంచంలోకి ఓ చిన్నారి వచ్చిన సందర్భంగా తమ గోప్యతను గౌరవించాలని కోరాడు.

విషయం తెలిసిన అభిమానులు, సన్నిహితులు, స్నేహితులు, తాజా, మాజీ క్రికెటర్లు యువరాజ్-హేజల్ దంపతులను అభినందనలతో ముంచెత్తుతున్నారు.

‘‘అభినందనలు సోదరా. నువ్వో గొప్ప తండ్రివి అవుతావు. చిన్నారిపై బోల్డంత ప్రేమ కురిపిస్తావు’’ అని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశాడు. కాగా, యువరాజ్ సింగ్ పోస్టునే యథాతథంగా హేజల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు. యువరాజ్-హేజల్ కీచ్‌ 30 నవంబరు 2016లో వివాహం చేసుకున్నారు.
Yuvraj Singh
Hazel Keech
Team India
Baby Boy

More Telugu News