ఏపీలో కొత్త పథకం.. రేపు అగ్రవర్ణ మహిళల ఖాతాల్లోకి రూ.15 వేలు చొప్పున జమ చేయనున్న సీఎం జగన్!
- 'వైఎస్సార్ ఈబీసీ నేస్తం' పథకం ప్రారంభం
- మూడేళ్లకు రూ.45 వేలు అందజేత
- ఏటా రూ.15 వేల చొప్పున జమ
- 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు మహిళలకు చేయూత
సీఎం జగన్ మంగళవారం నాడు క్యాంపు కార్యాలయం నుంచి ఒక్క బటన్ నొక్కడం ద్వారా నగదును ఆయా మహిళల ఖాతాలకు బదిలీ చేయనున్నారు. ఈ పథకం ద్వారా 3.92 లక్షల మంది అగ్ర వర్ణ పేద మహిళలు ప్రయోజనం పొందనున్నారు.