మంత్రి కొడాలి నానిపై మరోసారి నిప్పులు చెరిగిన బుద్ధా వెంకన్న

Budha Venkanna fires on Kodali Nani
  • కేసినో వ్యవహారంలో వైసీపీ వర్సెస్ టీడీపీ
  • కొడాలి నానిపై టీడీపీ నేతల ఫైర్
  • కొడాలి నాని ఆయిల్ దొంగ అంటూ బుద్ధా వ్యాఖ్యలు
టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న మంత్రి కొడాలి నానిపై ఈసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అరేయ్ కొడాలి నాని... నీ భాష ఏంటి, నీ చరిత్ర ఏంటిరా? అంటూ ఘాటైన రీతిలో స్పందించారు. "గుడివాడలో ఆయిల్ దొంగవి నువ్వు... వర్ల రామయ్య నిన్ను లోపల వేసి చితకబాదాడు. పోలీసులు లేకుండా విజయవాడలో ప్లేస్, టైమ్ ఫిక్స్ చెయ్యి... కొట్టుకుందాం! గుడివాడలో వ్యభిచార కంపెనీ తీసుకువచ్చావు, నోటిదూలతో కృష్ణా జిల్లా పరువు తీశావు" అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు.

కాగా, తన ఇంటికి పోలీసులు రావడంపైనా బుద్ధా స్పందించారు. ఏపీ పోలీసుల తీరు అత్యంత విచారకరం అని పేర్కొన్నారు. "విచ్చలవిడిగా క్యాసినో నడిపిస్తే నో పోలీస్... ప్రతిపక్ష నేతని మంత్రి కొడాలి నాని బూతులు తిట్టినా నో పోలీస్. నేను మీడియా సమావేశం పెట్టిన అరగంటకే ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తామంటున్నారు. పరిస్థితి చూస్తుంటే రాష్ట్రంలో పోలీసులు ఖాకీ డ్రెస్ తీసేసి వైసీపీ డ్రెస్ వేసుకున్నారని అర్థమవుతోంది" అని వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Budha Venkanna
Kodali Nani
Casino
TDP
YSRCP

More Telugu News