'మేజర్' కూడా వాయిదానే!
- 'మేజర్'గా అడివి శేష్
- నిర్మాతగా మహేశ్ బాబు
- ఫిబ్రవరి 11 నుంచి తప్పుకున్న సినిమా
- త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటన
శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందించిన ఈ సినిమాను ఫిబ్రవరి 11వ తేదీన విడుదల చేయనున్నట్టు కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. అయితే ఆ రోజున ఈ సినిమా థియేటర్లకు రావడం లేదనేది తాజా సమాచారం. ఈ సినిమాను అదే రోజున హిందీలోనూ విడుదల చేయాలనుకున్నారు. కరోనా కారణంగా పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వలన వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు.
మళ్లీ ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేయనున్నామనేది త్వరలోనే చెబుతామని అన్నారు. ఇక ఇదే నెలలో థియేటర్లకు వెళదామనుకున్న 'ఆచార్య' కూడా వాయిదాపడిన సంగతి తెలిసిందే. ఇక ఫిబ్రవరి నెలలో 'భీమ్లా నాయక్' .. ' ఖిలాడి' సినిమాలు మాత్రం విడుదలకి రెడీ అవుతున్నాయి. మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి మరి!