స్లో ఓవర్ రేట్ ఫలితం... టీమిండియా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో కోత
- కేప్ టౌన్ లో మూడో వన్డే
- నిర్దేశిత సమయానికి 2 ఓవర్లు తక్కువ బౌల్ చేసిన భారత్
- టీమిండియాకు స్లో ఓవర్ రేట్ జరిమానా
- మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత
ఐసీసీ స్లోఓవర్ రేట్ నిబంధన 2.22 ప్రకారం నిర్దేశిత సమయానికి ఒక ఓవర్ తక్కువగా బౌల్ చేస్తే ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తారు. ఆ లెక్కన టీమిండియా రెండు ఓవర్లు తక్కువగా బౌల్ చేయడంతో 40 శాతం ఫీజు కోత విధించారు. తప్పిదాన్ని టీమిండియా కెప్టెన్ కెఎల్ రాహుల్ అంగీకరించడంతో తదుపరి విచారణ అవసరం లేకుండా జరిమానాతో సరిపెట్టారు.