Arunanchal boy: అరుణాచల్ ప్రదేశ్ బాలుడి ఆచూకీని నిర్థారించిన చైనా ఆర్మీ

Missing Arunanchal boy found by China PLA
  • చైనా పీఎల్ఏ మాకు సమాచారం ఇచ్చింది
  • విడిపించేందుకు విధివిధాలను పాటిస్తున్నాం
  • రక్షణ శాఖ ప్రకటన విడుదల
కొన్ని రోజుల క్రితం అరుణాచల్ ప్రదేశ్ లోని భారత సరిహద్దుల్లో బాలుడ్ని అపహరించుకుపోయిన చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) ఎట్టకేలకు స్పందించింది. బాలుడి ఆచూకి కనుగొన్నట్టు భారత సైన్యానికి సమాచారం ఇచ్చింది.

అరుణాచల్ ప్రదేశ్ లోని అప్పర్ సియాంగ్ జిల్లాకు చెందిన 17 ఏళ్ల బాలుడు మిరమ్ తరోన్ ను చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) సైనికులు గత మంగళవారం అపహరించి తీసుకు పోయారు. ఈ విషయాన్ని రాష్ట్రానికి చెందిన ఎంపీ తపిర్ గావో ట్విట్టర్ లో ప్రకటించడమే కాకుండా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నితీష్ ప్రమాణిక్ దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో భారత సైన్యం చైనా పీఎల్ఏ అధికారులతో మాట్లాడింది. మూలికలను సేకరించేందుకు వెళ్లి మార్గం తప్పిపోయాయడని, కనిపించడం లేదని తెలియజేసింది. చైనా సైన్యం సహకారం కావాలని, సంబంధిత బాలుడ్ని గుర్తించి, తమకు అప్పగించాలని కోరింది.  

అరుణాచల్ ప్రదేశ్ నుంచి తప్పిపోయిన బాలుడ్ని గుర్తించినట్టు చైనా ఆర్మీ మాకు సమాచారం ఇచ్చింది. అతడ్ని తీసుకొచ్చేందుకు విధి, విధానాలను అనుసరిస్తున్నాం’’అంటూ రక్షణ శాఖ ప్రజా సంబంధాల అధికారి తేజ్ పూర్ లెఫ్టినెంట్ కల్నల్ హర్ష్ వర్ధన్ పాండే ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు.
Arunanchal boy
missing
found
china
pla

More Telugu News